Telangana Budget: రుణమాఫీపై హరీశ్ రావు గుడ్ న్యూస్

|

Mar 08, 2020 | 12:51 PM

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రైతాంగానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు.

Telangana Budget: రుణమాఫీపై హరీశ్ రావు గుడ్ న్యూస్
Follow us on

Loan weaving cheques issued soon: తెలంగాణలో రైతు రుణమాఫీ విధానంలో సరికొత్త మార్పు తీసుకొచ్చారు. వార్షిక బడ్జెట్‌లో ఈ అంశాన్ని వెల్లడించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. రుణమాఫీ కోసం గత ఏడాదికాలంగా ఎదురు చూస్తున్న రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పారు.

ఇకపై రైతు రుణమాఫీ మొత్తాలను నేరుగా రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 25 వేల రూపాయలలోపు రుణాలున్న రైతులకు ఒకే విడతలో మార్చి నెలాఖరులోగా చెక్కుల పంపిణీ జరుగుతందన్నారు. ఈ రకమైన  రైతులు రాష్ట్రంలో 5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని వీరందరికీ 100 శాతం ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మార్చి నెలలోనే స్థానిక శాసనసభ్యుల చేతులమీదుగా చెక్కుల పంపిణీ కోసం 1198 కోట్లు కేటాయిస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు.

25 వేల నుంచి లక్ష లోపు రుణాలున్న రైతులకు కూడా వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేత నాలుగు విడతలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందుకోసం.. 6,0225 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆయన వివరించారు.

Read this: Highlights of Telangana Budget 2020  తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు