Live Updates: నెరవేరుతున్న సొంతింటి కల.. ఇళ్ల పట్టాలను అందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

|

Dec 28, 2020 | 2:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తోంది.

Live Updates: నెరవేరుతున్న సొంతింటి కల.. ఇళ్ల పట్టాలను అందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తోంది. ఇవాళ చిత్తూరు జిల్లా శ్రీకాళహాస్తీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఆ స్థలంలో మహిళల పేరుతో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ప్రారంభించారు. పేదలందరికీ ఇళ్లకు సంబంధించిన పైలాన్‌ను ఆయన‌ ఆవిష్కరించారు. నిరు పేదల కుటుంబాలకు చెందిన మహిళలకు సీఎం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సీఎం జగన్..   అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించారు.

రాష్ట్రంలో ప్రతి పేద వాడికి సొంతుల్లు ఉండాలన్న సంకల్పంతోనే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. సామాజికంగా, ఆర్థిక, రాజకీయంగా ఎదిగినప్పడే సమాజం కూడా బాగుపడుతుందని ఆయన స్పష్టం చేశారు. అందుకు ప్రతి అక్కా,చెల్లమ్మకు ఒక అన్నగా ఉండాలన్నదే జీవితాశయమన్నారు. అక్కా చెల్లెమ్మలు తెలిసినట్టుగా రూపాయి విలువ మగవాళ్లకు తెలీదన్న సీఎం.. వారి కోసమే అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. వారిని రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే ఇళ్ల పట్టాల పంపిణీ కూడా వారి పేరుతోనే ఇస్తున్నామన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Dec 2020 01:48 PM (IST)

    అన్ని కులాల వారు ఉంటేనే రాజధాని అవుతుందిః జగన్

    పేదలందరికీ ఇళ్ల పథకంలో అందరికీ ఇళ్లు ఇస్తుంటే పసుపు పార్టీల జీర్ణించుకోలేకపోతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. కుల సమీకరణాలు దెబ్బతింటాయనే కారణంతో అమరావతిలో 54వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని మండిపడ్డారు. అన్ని కులాల వారు ఉంటేనే అది రాజధాని అవుతుందన్న జగన్, అలాంటి రాజధాని తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.

  • 28 Dec 2020 01:46 PM (IST)

    పట్టాల పంపిణీకి టీడీపీ అడ్డుకుంటోందిః జగన్

    పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా టీడీపీ అడ్డుపడిందని జగన్ ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేసి చాలాసార్లు అడ్డుకున్నారన్నారు. మొదట ఉగాది రోజు పంపిణీ చేద్దామని అనుకున్నా.. కోర్టుల కేసుల కారణంగా పలు మార్లు వాయిదా పడిందని చెప్పారు. ఏకంగా తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులపై కూడా కోర్టులో కేసులు వేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ న్యాపరమైన చిక్కుల వల్ల 3.7 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించలేకపోతున్నామని, వారికి కూడా లీగల్ సమస్యలు తీరిన వెంటనే ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు.


  • 28 Dec 2020 01:44 PM (IST)

    లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ మూడు ఆఫర్లు

    ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రజలకే ఇస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

    ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు.

    ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్‌కి కొంత, పిల్లర్స్‌కి కొంత, స్లాబ్‌కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.

    ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.

  • 28 Dec 2020 01:42 PM (IST)

    పేదల కోసం ఖర్చుల భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందిః జగన్

    రాష్ట్రంలో కులమతాలకు సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించామన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇళ్లు కాదు, ఊళ్లు ఏర్పడతాయని జగన్ అన్నారు. ప్రస్తుతం సేకరించిన ఇళ్ల స్థలాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఆ తర్వాత రెండో దశలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. 37.50 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం రూ.54,940 కోట్లు ఖర్చవుతుందన్నారు.

  • 28 Dec 2020 01:36 PM (IST)

    పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ

    పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ 175 నియోజకవర్గాల్లో నేటి నుండి పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా అక్కాచెల్లెళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లుగా ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసి ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.

  • 28 Dec 2020 01:30 PM (IST)

    ఇళ్ల కేటాయింపుల్లో పూర్తిగా పారదర్శకతః సీఎం

    పక్కా ఇళ్లు లేని వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతో ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నామన్నారు. ఇళ్ల స్థలం పరిమితి ఇప్పుడు 224 చదరపు అడుగులుండగా..340 చదరపు అడుగులకు పెంచుతామన్నారు. పట్టాల పంపిణీ ద్వారా ఇళ్ల నిర్మాణంతో కోటిమందికి పైగా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

  • 28 Dec 2020 01:30 PM (IST)

    పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాః జగన్

    ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నానన్నారు. 31 లక్షలమందికి పైగా పేదలకు సొంతింటి కలను నిజం చేశామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

  • 28 Dec 2020 01:29 PM (IST)

    మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నదే ప్రథమ లక్ష్యంః జగన్

    అక్కా చెల్లెమ్మలను సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నదే ప్రథమ లక్ష్యంగా వైసీపీ సర్కార్ పని చేస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇచ్చే ప్రతి రూపాయి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాము. అక్కడ అవినీతి జరగకుండా విపక్షతకు తావులేదు.

  • 28 Dec 2020 01:29 PM (IST)

    సకల హంగులతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలుః జగన్

    రాష్ట్రంలో 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రానున్నాయని.. కొత్తగా ఏర్పడే కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్క్‌లు, కమ్యూనిటీ హాల్స్, విలేజ్ క్లినిక్‌లు, అంగన్ వాడీ కేంద్రాల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని జగన్ చెప్పారు.

  • 28 Dec 2020 01:08 PM (IST)

    ఏర్పేడు రూరల్‌ ప్రాంతంలో 8,600 మొక్కలు నాటిన సీఎం

    ఊరందూరులో వైఎస్సార్‌ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్‌ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సోమవారమే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు జగన్.

  • 28 Dec 2020 01:07 PM (IST)

    ఊరందూరుకు చేరుకున్న సీఎం జగన్

    పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు చేరుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పైలాన్‌ను ఆయన‌ ఆవిష్కరించారు. మరికొద్దిసేపట్లో సీఎం ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. అనంతరం వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

  • 28 Dec 2020 01:02 PM (IST)

    తొలివిడతలో 5,548 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

    ఊరందూరులో వైఎస్సార్‌ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్‌ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Follow us on