మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్ సర్కార్..!

|

Aug 08, 2020 | 3:31 PM

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ రాబోతోందా.? లాక్‌డౌన్ తర్వాత విపరీతంగా పెరిగిన మద్యం ధరలు తగ్గుతాయా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్ సర్కార్..!
Follow us on

Liquor Prices Drop In AP: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ రాబోతోందా.? లాక్‌డౌన్ తర్వాత విపరీతంగా పెరిగిన మద్యం ధరలు తగ్గుతాయా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పున: సమీక్షించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింటి ధరలూ కాకపోయినా చీప్ లిక్కర్ ధరలను మాత్రం తగ్గించడానికి అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

మద్యం ధరలు విపరీతంగా పెరగడం.. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో కొంతమంది శానిటైజర్లకు అలవాటు పడుతున్నారు. ఇటీవల అవి తాగడం వల్ల ప్రకాశం జిల్లాలో మరణాలు సంభవించాయి. ఇలాంటి ఘటనలే మిగిలిన జిల్లాల్లో కూడా జరుగుతుండటంతో అధికారులు కల్తీ శానిటైజర్లపై దాడులు చేస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి సైతం చీప్ లిక్కర్ పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తోంది. దీనితో వరుస దాడుల్లో భారీగా మద్యం సీసాలు పట్టుబడుతున్నాయి. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో మద్యం ధరలను తగ్గించాలన్న డిమాండులు వెల్లువెత్తాయి. దీనితో ప్రభుత్వం మద్యం ధరలపై పునరాలోచన చేస్తోంది. రెండు మూడు రోజుల్లోనే తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: ఏపీ వచ్చే విదేశీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. క్వారంటైన్ నుంచి మినహాయింపు!