హైదరాబాద్‌లో కలకలం.. ‌‌గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

|

Dec 13, 2020 | 9:00 AM

ఈ మధ్య పలు చోట్ల చిరుతలు, పులులు దర్శనమిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. జనావాసంలోకి వస్తున్న ఈ మృగాలు పశువులపై , పెంపుడు జంతువులపై దాడిచేసి కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్‌లో కలకలం.. ‌‌గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
Cheetah
Follow us on

ఈ మధ్య పలు చోట్ల చిరుతలు, పులులు దర్శనమిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. జనావాసంలోకి వస్తున్న ఈ మృగాలు పశువులపై , పెంపుడు జంతువులపై దాడిచేసి కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తుంది. గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజీలో ఓ కుక్కను చిరుత పులి ఎత్తుకు వెళ్లిందని స్థానికులు చెప్తున్నారు. అక్కడున్న కాలేజీలో చిరుత సంచరిస్తుందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరిస్తుందా ? లేదా? తెలుసుకునేందుకు దాని కోసం ట్రాక్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలేజీ పక్కన ఉన్న గుట్టలోకి చిరుత వెళ్లిఉంటుందని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత సంచరిస్తుందన్న అనుమానంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.