ఆ ఏడుగ్రామాల్లో భయం భయం

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 1:37 PM

చిరుత పులి సంచారంతో ఏడు గ్రామాల ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఇంటిలోనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కొనిగడ్ల, లక్ష్మాపుర్,

ఆ ఏడుగ్రామాల్లో భయం భయం
Follow us on

Leopard Roaming in Nalgonda District : చిరుత పులి సంచారంతో ఏడు గ్రామాల ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఇంటిలోనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కొనిగడ్ల, లక్ష్మాపుర్, కాట్రియాల, దత్తవల్లరి, పర్వతాపూర్, అక్కన్నపేట, ఝాన్సిలింగాపూర్ చిరుత సంచరిస్తోంది. ఎక్కడో ఒకచోట దాడులకు పాల్పడుతూనే ఉంది. పాకల్లో పశువులను చంపితింటోంది. గత ఏడాది కాలంలో 30 నుంచి 35 వరకు పశువులపై దాడి చేసింది.

తాజాగా తొనిగండ్ల గ్రామంలో చిరుత దాడి చేసింది. పశువుల కొట్టంలో కట్టేసిన ఆవుపై దాడి చేసి చంపేసింది. గ్రామానికి చెందిన రంగేరి రత్నం పొలం వద్ద పశువుల కొట్టంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆవు దూడ చనిపోవడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. గ్రామ శివారులో చిరుత అడుగుజాడలను గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.