దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్… విజయవాడలో అన్నదాతలకు మద్దతుగా భారీ ర్యాలీ

|

Dec 08, 2020 | 10:50 AM

దేశవ్యాప్తంగా రైతుసంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాలకు నిరసనగా అన్నదాతలు భారత్ బంద్ చేపట్టారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్... విజయవాడలో అన్నదాతలకు మద్దతుగా భారీ ర్యాలీ
Follow us on

దేశవ్యాప్తంగా రైతుసంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాలకు నిరసనగా అన్నదాతలు భారత్ బంద్ చేపట్టారు. ప్రభుత్వం రూపొందించిన చటం ద్వారా రైతులకు నష్టం చేకూరుతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లోను రైతులకు మద్దతుగా బీజీపీ మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు తెలుపుతున్నాయి. విజయవాడలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్‌ పిలుపులో భాగంగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు సహా రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. లెనిన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏలూరు రోడ్డు మీదుగా పోలీస్‌ కంట్రోల్‌ రూం వరకూ.. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా కృష్ణా జిల్లా గ్రంథాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కేంద్రం 5 సార్లు రైతుసంఘాలతో చర్చలు జరిపింది. చర్చలు విఫలం దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చారు అన్నదాతలు.  రేపు మరోసారి కేంద్రం రైతుసంఘాలతో చర్చలు జరపనుంది.