విద్యార్థులను చితకొట్టిన లెక్చరర్స్

| Edited By:

Mar 19, 2019 | 11:05 AM

రాజస్థాన్‌లోని జున్‌జున్ పట్టణంలో దారుణం జరిగింది. స్థానిక జగదీశ్ డిగ్రీ కాలేజ్‌‌లో విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇద్దరు విద్యార్థులను చితకబాదారు లెక్చరర్లు. ఇద్దరు విద్యార్థులను కిందపడేసి చితకబాదారు సిబ్బంది. లేడీ లెక్చరర్ కూడా విద్యార్థులను కర్రతో చితకబాదడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎగ్జామ్స్ విషయంపై చర్చిద్దామని పిలిచి తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. […]

విద్యార్థులను చితకొట్టిన లెక్చరర్స్
Follow us on

రాజస్థాన్‌లోని జున్‌జున్ పట్టణంలో దారుణం జరిగింది. స్థానిక జగదీశ్ డిగ్రీ కాలేజ్‌‌లో విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇద్దరు విద్యార్థులను చితకబాదారు లెక్చరర్లు.

ఇద్దరు విద్యార్థులను కిందపడేసి చితకబాదారు సిబ్బంది. లేడీ లెక్చరర్ కూడా విద్యార్థులను కర్రతో చితకబాదడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎగ్జామ్స్ విషయంపై చర్చిద్దామని పిలిచి తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. విద్యార్థులతో పాటు లెక్చరర్లపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. బయటి వ్యక్తులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతోనే గొడవ చినికి చినికి గాలి వానగా మారిందని అంటున్నారు పోలీసులు.