BJP Laxman: ఉద్యోగులు ‘ఆ’ సమయంలో గొర్రెలే.. లక్ష్మణ్ కామెంట్

|

Mar 04, 2020 | 1:49 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డా. కే. లక్ష్మణ్ ప్రభుత్వ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్లను తుంగలో తొక్కుతున్న టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయం వచ్చేసరికి గొర్రెల్లా ఓట్లు వేసేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.

BJP Laxman: ఉద్యోగులు ‘ఆ’ సమయంలో గొర్రెలే.. లక్ష్మణ్ కామెంట్
Follow us on

BJP Laxman says employees becoming sheeps while voting: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డా. కే. లక్ష్మణ్ ప్రభుత్వ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్లను తుంగలో తొక్కుతున్న టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయం వచ్చేసరికి గొర్రెల్లా ఓట్లు వేసేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ఉద్యోగుల తలచుకుంటే టిఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని, అయిదేళ్ళ పాటు అండగా నిలబడిన బీజేపీని కాదని, ఎన్నికల సమయంలో గొర్రెల్లా టీఆర్ఎస్ పార్టీకి ఉద్యోగులు ఓట్లు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న లక్ష్మణ్.. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలు అవుతుందో అర్థం కావడం లేదని, బంగారు తెలంగాణ కోసం పోరాటం చేసిన బీజేపీ నేతలు రాళ్ళ దెబ్బలు తింటే… అసలు ఉద్యమంతో సంబంధం లేనోళ్లు ఇవాళ ప్రగతి భవన్‌లో భోగాలు అనుభవిస్తున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గత అరేళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు , టీచర్ల అరణ్య రోదన వినే నాధుడే తెలంగాణలో లేడని, ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు, బెదిరింపులు ఎదురవుతున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి మంత్రులు , ఎమ్మెల్యేలు తాబేదారులుగా మారి పోయారని, ఉద్యోగ సంఘాల నాయకులు అని చెప్పుకునే కొందరు ఆర్టీసీ కార్మికుల ఉద్యమాన్ని నీరు గార్చే కుట్ర పన్నారని ఆయన విమర్శించారు. 30 మంది ఆర్టీసీ కార్మికుల చావుకు ప్రభుత్వం కారణం అయిందని ఆరోపించిన బీజేపీ నేత.. ఉద్యోగులు తిరగబడితే ప్రభుత్వం పరిస్థితి మరోలా ఉంటుందని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ టీచర్లను కాదని బయటి నుంచి తీసుకొచ్చిన కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా ఇంటర్ పేపర్ దిద్దిచ్చి విద్యార్థుల చావుకు కేసీఆర్ ప్రభుత్వం కారణమయితే బీజేపీ తరపున పోరాడామని, ఆర్టీసీ ఉద్యోగులు, ఇంటర్ విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాడిందని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: పవన్‌కల్యాణ్‌కు షాకిచ్చిన అమిత్‌షా  Amitshah shocks Pawan Kalyan