వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, రజినిలతో సహా మరో ముగ్గురిపై హైకోర్టులో పిల్

|

May 01, 2020 | 8:11 AM

వై‌సీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనావైర‌స్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న‌ వేళ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అధికార పార్టీ నేతలు వివిధ‌ సమావేశాల్లో పాల్గొంటున్నారని లాయర్ కిషోర్ పిల్‌లో తెలిపారు. వారిని అడ్డుకోవడంతో పాటు రూల్స్ పాటించ‌ని వైసీపీ నేత‌ల‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరడం విశేషం. ఈ పిల్‌లో ప్రతివాదులుగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల రజినీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు […]

వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, రజినిలతో సహా మరో ముగ్గురిపై హైకోర్టులో పిల్
Follow us on

వై‌సీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనావైర‌స్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న‌ వేళ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. అధికార పార్టీ నేతలు వివిధ‌ సమావేశాల్లో పాల్గొంటున్నారని లాయర్ కిషోర్ పిల్‌లో తెలిపారు. వారిని అడ్డుకోవడంతో పాటు రూల్స్ పాటించ‌ని వైసీపీ నేత‌ల‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరడం విశేషం. ఈ పిల్‌లో ప్రతివాదులుగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల రజినీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను చేర్చాలని కోరారు.

లాక్‌డౌన్ అమల్లో ఉన్న అమలులో ఉన్న సమయంలో.. వైసీపీ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని లాయర్ కిషోర్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత విపత్క‌ర ప‌రిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయని.. కొంద‌రు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని బేఖాత‌రు చేస్తున్నార‌ని ఆయ‌న అంటున్నారు.