బ్రేకింగ్: వనస్థలిపురంలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. 184 మందికి ఇళ్ల పట్టాల అందజేత

|

Dec 16, 2020 | 11:48 AM

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి,....

బ్రేకింగ్: వనస్థలిపురంలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. 184 మందికి ఇళ్ల పట్టాల అందజేత
Follow us on

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ 184 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. రూ.28 కోట్లతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. 9 అంంతస్తుల్లో మూడు బ్లాక్ లు నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల కిందట ఇక్కడే అపరిశుభ్ర వాతావరణంలో బస్తీ ఉండేదని, పేదవారు ఆత్మగౌరవంగా బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్య‌మ‌ని అన్నారు. ఇలాంటి ఇళ్లు దేశంలో ఎక్కడా చేపట్టలేదని అన్నారు. లక్ష‌ ఇళ్లు 90 శాతం పూర్తయ్యాయని, లబ్ధిదారుల చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు స‌మ‌స్య‌లు తీర్చడంలో ప్ర‌భుత్వం ముందుంటుంద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క నిరుపేద‌వాడికి ఇళ్లు ఉండాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు.

వనస్థలిపురంలో ఇదే ఇళ్లు కొనుగోలు చేయాలనిరూ.40 నుంచి50 లక్ష‌లు ఖర్చు అవుతుందని, పేదలకు అందజేస్తున్న ఈ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. వ్యాధులకు దూరంగా ఉండాలంటే పారిశుధ్యం ముఖ్యమంత్రి మంత్రి సూచించారు.