చిన్నారిపై మహిళ దాష్టీకం.. వివరాలు తెలపాలన్న రజనీ భార్య

| Edited By:

Jul 22, 2019 | 9:40 AM

మానవత్వం రోజు రోజుకు మంటకలిసిపోతోంది. మనుషులన్నది మర్చిపోయి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఓ మహిళ చిన్నారిపై తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. ఆ చిన్నారికి చిత్రహింసలు చేసి కాలితో తొక్కుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు చేరింది. దీంతో వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ఆ వివరాలు తెలపాలంటూ విన్నవించింది. మనమందరం కలిసి మార్పును తీసుకొద్దాం. ఈ వీడియోలో ఉన్న నిస్సాహయ చిన్నారి వివరాలు […]

చిన్నారిపై మహిళ దాష్టీకం.. వివరాలు తెలపాలన్న రజనీ భార్య
Follow us on

మానవత్వం రోజు రోజుకు మంటకలిసిపోతోంది. మనుషులన్నది మర్చిపోయి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఓ మహిళ చిన్నారిపై తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. ఆ చిన్నారికి చిత్రహింసలు చేసి కాలితో తొక్కుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు చేరింది. దీంతో వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ఆ వివరాలు తెలపాలంటూ విన్నవించింది.

మనమందరం కలిసి మార్పును తీసుకొద్దాం. ఈ వీడియోలో ఉన్న నిస్సాహయ చిన్నారి వివరాలు తెలిస్తే నాకు తెలపండి. దోషులు కచ్చితంగా శిక్షార్హులు. దీనికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా 18001208866 నంబర్‌కు ఫోన్ చేసి తెలపండి అని ఆమె విఙ్ఞప్తి చేశారు. కాగా అనాథ పిల్లల రక్షణ కోసం లతా రజనీకాంత్ దయా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.