రాహుల్ గాంధీపై హత్యాయత్నం..?

| Edited By:

Apr 11, 2019 | 5:45 PM

ఉత్తరప్రదేశ్ : రాహుల్ గాంధీ ప్రాణానికి ముప్పు ఉంద‌ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల తన సొంత నియోజవకర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతికిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్టు వీడియోల్లో కనిపించింది. మొత్తం ఏడు సార్లు రాహుల్ నుదుటిపై ఫోకస్ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ అధినేత ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారు. ఈ మేరకు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ […]

రాహుల్ గాంధీపై హత్యాయత్నం..?
Follow us on

ఉత్తరప్రదేశ్ : రాహుల్ గాంధీ ప్రాణానికి ముప్పు ఉంద‌ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల తన సొంత నియోజవకర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతికిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్టు వీడియోల్లో కనిపించింది. మొత్తం ఏడు సార్లు రాహుల్ నుదుటిపై ఫోకస్ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ అధినేత ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారు. ఈ మేరకు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు.

రాహుల్ గాంధీకి కల్పిస్తున్న భద్రతలో లోపాలు ఉన్నాయంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం రాహుల్‌కు ఎస్పీజీ పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర హోంశాఖ స్పందించింది. సెల్‌ఫోన్ నుంచి లేజ‌ర్ లైట్ వ‌చ్చిన‌ట్లు ఎస్పీజీ డైర‌క్ట‌ర్ వెల్ల‌డించార‌ని హోంశాఖ తెలిపింది. రాహుల్ క‌నుబొమ్మ‌పై గ్రీన్ రంగులో ఉన్న లేజ‌ర్ లైట్ ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఏఐసీసీ ఫోటోగ్రాఫ‌ర్ వాడుతున్న కెమెరా నుంచి ఆ గ్రీన్ లైట్ వ‌చ్చి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.