
ఆర్టికల్ 370 రద్దు పై పార్లమెంట్లో చర్చ సమయంలో పదునైన ప్రసంగంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లద్దాఖ్ ఎంపీ జమ్మాంగ్ నంగ్యాల్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. లద్దాఖ్ సంప్రదాయ వస్త్రాలు ధరించి స్థానికులతో కలిసి డ్యాన్స్ వేశారు. అనంతరం సంప్రదాయ డప్పును అలవోకగా వాయించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ.. తాను లద్దాఖ్కు చెందిన వ్యక్తినని. ప్రత్యేక లద్దాఖ్పై ఇక్కడి ప్రజలకు మాటిచ్చానని అందుకే తనని గెలిపించారని అన్నారు. మీరు మాట్లాడటానికి ఏమీలేదు. కూర్చొండంటూ పార్లమెంట్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ ప్రసంగం కాస్తా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఈయనను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.