రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

|

Nov 21, 2020 | 8:16 AM

కార్మికుల పని వేళలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ తాజాగా కొత్త సవరణలు చేసింది. ఓ కార్మికుడు విరామాలతో కలిపి రోజుకు 12 గంటలు పని చేయాలని..

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..
Follow us on

Labor Ministry: కార్మికుల పని వేళలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ తాజాగా కొత్త సవరణలు చేసింది. ఓ కార్మికుడు విరామాలతో కలిపి రోజుకు 12 గంటలు పని చేయాలని ప్రతిపాదించింది. దీనిని వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమావళి-2020(ఓఎస్‌హెచ్)లో చేర్చాలని సూచించింది. అలాగే వారంలో గరిష్టంగా 48 గంటలు(రోజుకు 8 గంటలు, ఒక రోజు సెలవు) మాత్రమే పని చేయాలని సూచిస్తూ నవంబర్ 19న నిబంధనలను నోటిఫై చేసింది.

కాగా, గతంలో ఓ కార్మికుడు గరిష్టంగా రోజుకు 8 గంటలు పని చేసేలా ప్రతిపాదించిన ఓఎస్‌హెచ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించినప్పటికీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రోజువారీ పని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా మార్పులు చేసింది. అంతేకాకుండా 8 గంటల కంటే అదనంగా పని చేసేవారికి OT అలవెన్స్ లభిస్తుందని.. ఓవర్ టైంలో 15-30 నిమిషాల సమయాన్ని అరగంటగా లెక్కిస్తారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇకపై ఏ కార్మికుడు కూడా అరగంట విరామానికి ముందు 5 గంటలు పని చేయకూడదని ఆయన పేర్కొన్నారు.