మెట్రో నగరాలపై కేటీఆర్ ఏమన్నారంటే..?

| Edited By:

Jun 29, 2019 | 7:03 AM

మెట్రో నగరాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో మేడ్ ఇన్ హైదరాబాద్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన ఆవిష్కరణలు అభివృద్ధికి ఊతమిస్తాయని చెప్పారు. నగరానికి చెందిన 25 మంది విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుల స్పూర్తి దాయక ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తక కాపీలను వీరందరికి కేటీఆర్ అందజేశారు. అంకుర స్థాపన అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని.. స్టార్టప్‌లు ప్రభుత్వ సహాకారాన్ని ఆశించకుండా […]

మెట్రో నగరాలపై కేటీఆర్ ఏమన్నారంటే..?
Follow us on

మెట్రో నగరాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో మేడ్ ఇన్ హైదరాబాద్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన ఆవిష్కరణలు అభివృద్ధికి ఊతమిస్తాయని చెప్పారు. నగరానికి చెందిన 25 మంది విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకుల స్పూర్తి దాయక ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తక కాపీలను వీరందరికి కేటీఆర్ అందజేశారు. అంకుర స్థాపన అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని.. స్టార్టప్‌లు ప్రభుత్వ సహాకారాన్ని ఆశించకుండా ముందుకెళ్లాలన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చెన్నై, బెంగళూరు, దిల్లీ, ముంబయి వాతావరణాలు, అక్కడి ప్రభుత్వాలపై సునిశిత విమర్శలతో ఛలోక్తులు విసిరారు. ఆ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వాతావరణం వ్యాపార అనుకూలమని.. చక్కటి వాతావరణంతో పాటు.. మంచి బిర్యానీ కూడా దొరుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు.