డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలపై.. మంత్రి కేటీఆర్ సమీక్ష..

| Edited By:

May 20, 2020 | 2:56 PM

హైదరాబాద్ లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బుధవారం ఈ సమీక్ష

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలపై.. మంత్రి కేటీఆర్ సమీక్ష..
Follow us on

Double bed room housing scheme: హైదరాబాద్ లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బుధవారం ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల వంద శాతం పూర్తి చేసి లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేశామన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి వాటిని కూడా పంపిణీ చేస్తామన్నారు.

కాగా.. ఈ సమావేశానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ , పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ హాజరయ్యారు.

[svt-event date=”20/05/2020,2:04PM” class=”svt-cd-green” ]

Also Read: ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..