KTR on KCR’s plan: పట్టణ ప్రగతి ఆలోచనకు మూలమిదే.. వాహ్ కేసీఆర్!

|

Feb 24, 2020 | 4:01 PM

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఈ కార్యక్రమం అమలు పరచడం వెనుక సీక్రెట్ వెల్లడించారు. అసలు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో క్లియర్‌గా వివరించారు కేటీఆర్.

KTR on KCRs plan: పట్టణ ప్రగతి ఆలోచనకు మూలమిదే.. వాహ్ కేసీఆర్!
Follow us on

KCR’s bench mark program Pattana Pragati launched: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం సక్సెస్ అయిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలపై ఫోకస్‌తో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ సర్కార్. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌లో శ్రీకారం చుట్టిన మునిసిపల్ మంత్రి కేటీఆర్.. అసలు పట్టణ ప్రగతి కార్యక్రమం ఆలోచన రావడం వెనుక సీక్రెట్ వెల్లడించారు.

పట్టణ ప్రగతి ఆలోచన వెనుక పారిశుధ్యంతోపాటు 24 గంటల పాటు తాగునీటి సరఫరా అమల్లోకి తేవాలన్న ఉద్దేశమే కేసీఆర్ మదిలో పట్టణ ప్రగతి ఆలోచనకు దారి తీసిందన్నారు కేటీఆర్. కెసీఆర్ మానసపుత్రిక పట్టణ ప్రగతి కార్యక్రమని చెప్పారాయన. పట్టణ ప్రగతి కింద మహబూబ్‌నగర్‌లో అత్యాధునిక మార్కెట్‌కు శంకుస్థాపన చేశామని, ప్రధానమైన సమస్య అయిన పబ్లిక్ టాయిలెట్లు, ఆ సమస్య పరిష్కారానికి 13 ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వెల్లడించారు.

నాలుగు వందల మంది స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక జోన్లను గుర్తించి షాపులు నిర్మిస్తామని, దళిత, గిరిజనవాడల నుంచి అభివృద్ధి పనులు ప్రారంభించాలని ముఖ్య మంత్రి ఆదేశించారని.. అందుకే ఆ వాడల్లో పర్యటించానని చెప్పుకొచ్చారు కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఏ మాత్రం లేవని అంటున్నారు మంత్రి. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం సక్సెస్ కాదన్నారు. అందుకే కొత్త పురపాలక చట్టాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని చెప్పారు కేటీఆర్. అభివృద్ధి చెందిన దేశాల్లో 24 గంటలు నీటి సరఫరా ఉంటుందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలోను 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారాయన. పారిశుధ్యం విషయంలో ప్రతీ ఒక్కరిలోను మార్పు రావల్సిన అవసరం ఉందన్నారు.

Read this: Jagan crucial comments on Chandrababu చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు