ఎన్నార్సీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

|

Dec 27, 2019 | 4:07 PM

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ఎన్నార్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీని, సిటిజన్‌షిప్ యాక్టును టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో వివరించారాయన. ఏ ఒక్కరి కోసమో పార్టీ స్టాండ్ వుండదని, అన్ని ఆలోచించిన తర్వాతనే పార్టీ పార్లమెంటరీ కమిటీ తగిన నిర్ణయం తీసుకుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు […]

ఎన్నార్సీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Follow us on

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ఎన్నార్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీని, సిటిజన్‌షిప్ యాక్టును టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో వివరించారాయన. ఏ ఒక్కరి కోసమో పార్టీ స్టాండ్ వుండదని, అన్ని ఆలోచించిన తర్వాతనే పార్టీ పార్లమెంటరీ కమిటీ తగిన నిర్ణయం తీసుకుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కాగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలుగా మునిసిపల్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందంటున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అభివృద్ధి ఫలాలే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతాయని ధీమా వ్యక్తం చేశారు.

కొత్తగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని కేటీఆర్‌ గుర్తు చేశారు. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోందని ఎద్దేవా చేశారు కేటీఆర్‌. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. తాము నేల విడిచి సాము చేయడం లేదన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌ అందించామని, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌నే ఆశీర్వదిస్తారని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.