హుజూర్‌నగర్ విక్టరీపై కెటీఆర్ సెన్సేషనల్ కామెంట్..ఏమన్నారంటే ?

|

Nov 04, 2019 | 8:31 PM

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంపై టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు తనదైన శైలిలో స్పందించారు. విజయం సాధించిన పది రోజుల తర్వాత ఆయన ఈ కామెంట్ చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్టోబర్ 21న హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగగా.. 24వ తేదీన ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని […]

హుజూర్‌నగర్ విక్టరీపై కెటీఆర్ సెన్సేషనల్ కామెంట్..ఏమన్నారంటే ?
Follow us on
ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంపై టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు తనదైన శైలిలో స్పందించారు. విజయం సాధించిన పది రోజుల తర్వాత ఆయన ఈ కామెంట్ చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్టోబర్ 21న హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగగా.. 24వ తేదీన ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పద్మావతిపై గెలిచారు. అయితే ఇవాళ హుజూర్‌నగర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో భేటీ అయిన కెటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవన్‌లో హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన గులాబీ శ్రేణులతో కెటీఆర్ సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు స్థానిక నేతలకు, పార్టీ శ్రేణులకు కెటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసన మండలి విప్ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే హరిప్రియ, భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ విజయం ఆషామాషీ కాదని, కార్యకర్తలతోపాటు నేతలంతా నడుం కట్టి గులాబీ అభ్యర్థిని గెలిపించారని కెటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి, అధికార పార్టీని బ్లేమ్ చేసి గెలవాలనుకుందని దాన్ని గులాబీ దళం తిప్పికొట్టిందని అన్నారాయన. ఒక దశలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేశాయని, అయినా ఫలితాన్ని మార్చలేకపోయారంటూ కెటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే ఊపు వచ్చే మునిసిపల్ ఎన్నికల్లోను చూపాలని కెటీఆర్ పిలుపునిచ్చారు.