కృష్ణవేణి మహోగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీలోకి 7.62 లక్షల క్యూసెక్కుల వరదనీరు

|

Oct 17, 2020 | 12:33 PM

కృష్ణవేణి మహోగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి 7.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో కృష్ణా డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 6.89 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇవాళ(శనివారం) ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. […]

కృష్ణవేణి మహోగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీలోకి 7.62 లక్షల క్యూసెక్కుల వరదనీరు
Follow us on

కృష్ణవేణి మహోగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి 7.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో కృష్ణా డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 6.89 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇవాళ(శనివారం) ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందుజాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించింది. మరోవైపు, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా రేషన్‌ సరుకులు, కొవ్వొత్తులు, కూరగాయలు పంపాలని ఆదేశించారు.

రెండోసారి కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పసుపు, కంద, అరటి వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయల తోటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి వదిలే క్రమంలో లంక గ్రామాలన్నీ నీట మునిగాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో సామాన్లతో కరకట్ట మీదకు వచ్చి అక్కడే తాత్కాలిక టెంట్‌లు వేసుకుని బతుకుతున్నారు. పునరావాస కేంద్రాలు కూడా సరిపడాలేవని బాధితులు చెబుతున్నారు.