Covid vaccine distribution : వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని లేదు.. ఎవరిష్టం వారిది : కృష్ణా జిల్లా కలెక్టర్

|

Jan 07, 2021 | 8:49 AM

కృష్ణా జిల్లాలో ప్రస్తుత కోవిడ్ స్థితిగతులపై కలెక్టర్ ఇంతియాజ్ కీలక విషయాలను వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని..

Covid vaccine distribution : వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని లేదు.. ఎవరిష్టం వారిది : కృష్ణా జిల్లా కలెక్టర్
Follow us on

Covid vaccine distribution : కృష్ణా జిల్లాలో ప్రస్తుత కోవిడ్ స్థితిగతులపై కలెక్టర్ ఇంతియాజ్ కీలక విషయాలను వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని..గడిచిన వారంలో ఒకటి కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవ్వడం శుభపరిణామని చెప్పారు. వ్యాక్సిన్ డ్రై రన్ వలన ఆరోగ్య శాఖ సిబ్బందికి వాక్సినేషన్‌పై పూర్తి అవగాహన వచ్చిందని పేర్కొన్నారు.  వ్యాక్సిన్ వచ్చిన తర్వాత హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రెండవ ప్రాధాన్యతగా ఫ్రెంట్ లైన్ వారియర్స్‌కి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మూడవ ప్రాధాన్యత కింద యాభై సంవత్సరాలు దాటినవారికి ఇస్తున్నట్లు వివరించారు.

వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలనేది లేదని.. ఎవరిష్టం వారిదని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవాలనే వారికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం గుర్తింపు కార్డు ఉంటే చాలని.. ఆ ప్రక్రియ తర్వాత మెసేజ్ ద్వారా వ్యాక్సినేషన్ సెంటర్ ఎక్కడ అనే వివరాలు వస్తాయని వివరించారు. వ్యాక్సిన్ స్టోరేజి, ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి అన్ని సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. వ్యాక్సినేషన్ తర్వాత కొద్దిసేపు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. హెల్త్ వర్కర్స్ కుటుంబ సబ్యులకు మొదటి దశలో వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు.

Also Read :

AP Temple Politics: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు శ్రీకారం

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్