మాణిక్కం ఠాగూర్‌కు చెప్పాల్సింది చెప్పా.. పీసీసీ పదవిపై మరోమారు తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టిన కోమటిరెడ్డి..

|

Dec 10, 2020 | 3:30 PM

టీపీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సూటిగా స్పందించారు. తన మనసులో మాటలను కుండబద్దలు కొట్టారు. గురువారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి..

మాణిక్కం ఠాగూర్‌కు చెప్పాల్సింది చెప్పా.. పీసీసీ పదవిపై మరోమారు తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టిన కోమటిరెడ్డి..
Follow us on

టీపీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సూటిగా స్పందించారు. తన మనసులో మాటలను కుండబద్దలు కొట్టారు. గురువారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ పదవిని తనకు ఇవ్వాలని రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా తనకు అవకాశం ఇస్తే పార్టీని నిలబెడతానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థ పాలనపై జనంలోకి వెళ్తానని చెప్పుకొచ్చారు. ఆరేళ్ల పాలనలో రూ. 4లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా విధానాలపై కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. 35 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, తనకు న్యాయం చేయాలని మాణిక్యం ఠాగూర్‌ను కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పీసీసీ పదవి తప్పకుండా తనకే వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, పీసీసీ పదవిపై తమ మనసులోని మాటను కోమటిరెడ్డి బ్రదర్స్ ఏనాడూ దాచుకోలేదు. గతంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ పదవిని తమకు ఇవ్వాలని బాహాటంగానే డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ మారుతానంటూ హెచ్చరించారు కూడా. ఆ సమయంలో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. కానీ అప్పట్లో ఉత్తమ్‌ను ఆ పదవి వరించింది. మరి ఇప్పుడు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.