నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. సొంతపనుల కోసమా..? పీసీసీ కోసమా..?

|

Dec 16, 2020 | 8:20 AM

తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు నేడు హస్తినాకు వెళ్లనున్నారు. సొంత పనుల కోసం వెంకట్ రెడ్డి..

నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. సొంతపనుల కోసమా..? పీసీసీ కోసమా..?
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు నేడు హస్తినాకు వెళ్లనున్నారు. సొంత పనుల కోసం వెంకట్ రెడ్డి ఢీల్లికి వెళ్తుండగా, డిఫెన్స్‌కు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి హస్తినాకు వెళ్తున్నారు. పనిలో పనిగా ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం కూడా ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే టీపీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా ఉన్న ఈ ఇరువురూ ఒకేసారి ఢిల్లీకి బయలు దేరడంపై తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ చీఫ్ కొత్త అధ్యక్షడి ఎంపికకు సంబంధించి ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పదవికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి, ఇటు వెంకట్ రెడ్డి హస్తినాకు పయనమవడంతో ఆసక్తి రేపుతోంది.

మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం పార్టీ సీనియర్లంతా పోటీ పడుతున్నారు. పీసీసీ చీఫ్‌ పదవికి తాము అర్హులంటే.. తాము అర్హులమంటూ వరుస ప్రకటనలు జారీ చేస్తున్నారు. తమ తమ అనుచరగణంతో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా, జానారెడ్డి, వి. హనుమంతరావు, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఇతర నేతలంతా తాము పీసీసీ చీఫ్ పదవి చేపట్టేందుకు అర్హులమని ప్రకటించారు. అయితే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూనే తమ మనసులోని మాటను పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ముందు కుండబద్దలు కొట్టారు.

Also read:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివురుగప్పిన నిప్పులా ఆదివాసీ ఉద్యమం.? ‘మావ నాటే మావ సర్కార్’ నినాదంతో మళ్లీ తుడుం దెబ్బ.!

లిప్ లాక్‌లు నేటి సినిమాలలో సాధారణమే అంటోన్న యంగ్ బ్యూటీ.. బాలీవుడ్‌లో ఈ సంస్కృతి ముప్పై ఏళ్ల క్రితమే..