ట్రాజిక్‌గా మారిన మ్యాజిక్… విన్యాసంలో విషాదం

| Edited By:

Jun 18, 2019 | 1:07 PM

మ్యాజిక్ విన్యాసం వికటించింది. సాహసం ప్రాణాల మీదకు తెచ్చింది. వినోదం కాస్త విషాదంగా ముగిసింది. ఎవరూ చేయని ఇంద్రజాలం చేద్దామనుకున్న ఆ మెజీషియన్.. చివరకు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. లైవ్ స్టంట్ చేసి ప్రజలను అబ్బురపరచాలనుకున్న ఆ జాదూగర్… కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. జాదూగర్ మంద్‌రాకేగా పేరుగాంచిన చంచల్ లహరి.. అందరూ చూస్తుండగా విన్యాసం ప్రదర్శించేందుకు గంగా నదిలో దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో తనను తాను కట్టుకొని ఓ బాక్సులో బంధించుకొని గంగానదిలోకి దిగారు. కానీ […]

ట్రాజిక్‌గా మారిన మ్యాజిక్... విన్యాసంలో విషాదం
Follow us on

మ్యాజిక్ విన్యాసం వికటించింది. సాహసం ప్రాణాల మీదకు తెచ్చింది. వినోదం కాస్త విషాదంగా ముగిసింది. ఎవరూ చేయని ఇంద్రజాలం చేద్దామనుకున్న ఆ మెజీషియన్.. చివరకు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. లైవ్ స్టంట్ చేసి ప్రజలను అబ్బురపరచాలనుకున్న ఆ జాదూగర్… కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

జాదూగర్ మంద్‌రాకేగా పేరుగాంచిన చంచల్ లహరి.. అందరూ చూస్తుండగా విన్యాసం ప్రదర్శించేందుకు గంగా నదిలో దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో తనను తాను కట్టుకొని ఓ బాక్సులో బంధించుకొని గంగానదిలోకి దిగారు. కానీ దురదృష్టవశాత్తు కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు జాదూగర్ మంద్‌రాకే మృతదేహాన్ని పోలీసులు కనుకొన్నారు. 24 గంటలు శ్రమించి గజ ఈతగాళ్లు డెడ్ బాడీని నదిలో గుర్తించారు.

అయితే గతంలో ఇదే విన్యాసాన్ని అనేక సార్లు ప్రదర్శించి విజయవంతమయ్యారు చంచల్ లహరి. నదిలోకి దిగి కేవలం 29 సెకన్లలో బయటకు వచ్చేవారు. ఈ విన్యాసం ప్రారంభానికి ముందు అక్కడ ఉన్న ప్రేక్షకులతో విన్యాసం గురించి ఓ కామెంట్ చేశారు. ఈ విన్యాసంలో 29 సెకన్లలో బయటకు వస్తే అది మ్యాజిక్ అవుతుందని.. రాకపోతే ట్రాజిక్ అవుతుందని వ్యాఖ్యానించారు. 29 సెకన్లు గడిచినా.. అతను బయటకు రాలేదు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల తర్వాత జాదూగర్ మంద్‌రాకే మృతదేహాన్ని కనుగొన్నారు. చంచల్ లహరి మృతి స్థానికంగా అందర్నీ కలచివేసింది. అయితే ఇలాంటి విన్యాసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మేజిషియన్స్ అంటున్నారు. ఏ మాత్రం పొరపాటు చేసినా.. సీన్ రివర్స్ అవ్వడం ఖాయమని పలువురు మేజీషియన్స్ తెలిపారు.