SRH Target సన్​రైజర్స్ గెలిచేనా…

|

Oct 18, 2020 | 6:04 PM

అబుదాబి వేదికగా సన్​రైజర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీనేశ్ కార్తీక్ 29 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. గిల్ (36), రానా (29), రాహుల్ త్రిపాఠి (23)  మోర్గాన్ (34 ) పర్వాలేదనిపించారు.

SRH Target సన్​రైజర్స్ గెలిచేనా...
Follow us on

SRH Target : అబుదాబి వేదికగా సన్​రైజర్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీనేశ్ కార్తీక్ 29 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. గిల్ (36), రానా (29), రాహుల్ త్రిపాఠి (23)  మోర్గాన్ (34 ) పర్వాలేదనిపించారు. సన్​రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2, థంపి, రషీద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే మరో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. కాగా, వార్నర్‌ సేన ఈ మ్యాచ్‌లో గెలుపొంది‌ కోల్‌కతాను అధిగమించి నాలుగో స్థానంలో నిలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 6 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.