అక్కడ మటన్ చాలా చీప్ గురూ..! ఎందుకంటే..?

| Edited By:

Dec 11, 2019 | 7:49 PM

అసలే ఉల్లిపాయలు, నిత్యావసరాల ధరలు పెరిగి చస్తుంటే…వారానికి ఒకసారి తినే చికెన్, మటన్ ధరలను కూడా పెంచేస్తున్నారు సిండికేట్‌గా మారిన వ్యాపారులు. అన్నీంటికి సామాన్యులే బాధలు పడాలా..అందుకే మహారాష్ట్రలోని  కొల్హాపూర్‌ ప్రజలు ఒక వినూత్న ఐడియాతో ముందుకు వచ్చారు. తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను విడతల వారీగా కోసి తక్కువ ధరకే అమ్మకం ప్రారంభించారు. వ్యాపారుల రూ. 700 వరకు కిలో మటన్‌కు డబ్బులు తీసుకుంటూ ఉండగా..వీరు మాత్రం రూ.400-450కే  అమ్మకాలు ప్రారంభించారు. మటన్ ధరలు […]

అక్కడ మటన్ చాలా చీప్ గురూ..!  ఎందుకంటే..?
Follow us on

అసలే ఉల్లిపాయలు, నిత్యావసరాల ధరలు పెరిగి చస్తుంటే…వారానికి ఒకసారి తినే చికెన్, మటన్ ధరలను కూడా పెంచేస్తున్నారు సిండికేట్‌గా మారిన వ్యాపారులు. అన్నీంటికి సామాన్యులే బాధలు పడాలా..అందుకే మహారాష్ట్రలోని  కొల్హాపూర్‌ ప్రజలు ఒక వినూత్న ఐడియాతో ముందుకు వచ్చారు. తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను విడతల వారీగా కోసి తక్కువ ధరకే అమ్మకం ప్రారంభించారు. వ్యాపారుల రూ. 700 వరకు కిలో మటన్‌కు డబ్బులు తీసుకుంటూ ఉండగా..వీరు మాత్రం రూ.400-450కే  అమ్మకాలు ప్రారంభించారు.

మటన్ ధరలు రోజురోజుకూ పెరగుతూ ఉండటంతో,  విసుగు చెందిన  కొల్హాపూర్‌ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవారం పాటు వారంతా ఒకే మాట ఉండి మటన్ అమ్మకాలు సాగించారు. దీంతో వ్యాపారులకు టెన్షన్ మొదలయ్యింది. ఎట్టకేలకు వారు స్థానికులతో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. మటన్ ధరలను రూ. 200 మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజంట్ కొల్లాపూర్‌‌లో కేజీ మటన్ రేటు కేవలం రూ.480 మాత్రమే. ఏది ఏమైనా ఈ వెరైటీ నిరసనతో దేశ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నారు కొల్హాపూర్‌ ప్రజలు.