ఆ సెల్‌ఫోన్‌లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ!

|

Sep 24, 2019 | 5:22 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మిస్టరీ తేలడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు..ఆయనను అంతగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చనిపోయిన రోజు కోడెల చివరి ఫోన్ కాల్ తన గన్‌మెన్ ఆదాబ్‌కు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పలు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో18 మందిని సాక్షులను విచారించారు. విచారణ నిమిత్తం వాంగూల్మం […]

ఆ సెల్‌ఫోన్‌లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ!
Follow us on

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మిస్టరీ తేలడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు..ఆయనను అంతగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చనిపోయిన రోజు కోడెల చివరి ఫోన్ కాల్ తన గన్‌మెన్ ఆదాబ్‌కు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పలు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో18 మందిని సాక్షులను విచారించారు. విచారణ నిమిత్తం వాంగూల్మం ఇచ్చేందుకు హాజరుకావాలని కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలను పోలీసులు ఆదేశించారు. అయితే 11 రోజుల తరువాత వస్తామని వారిద్దరూ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఇక చనిపోయిన రోజు కోడెల తిన్న ఆహారాన్ని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

 

కోడెల ఆత్మహత్య కేసులో మిస్టరీగా ఉన్న అంశాలు:

  1. కోడెల సూసైడ్ నోట్ రాయలేదు కాబట్టి..ఆయన ఫోన్‌లో ఏమైనా సెల్పీ వీడియోను రికార్డు చేశారా?
  2. ఆ ఫోన్‌ను కుటుంబ సభ్యులు ఎందుకు పోలీసులకు అప్పగించడం లేదు?
  3.  చనిపోవడానికి ముందుగా 15 రోజుల క్రితం ఆయన సూసైడ్‌కి ప్రయత్నించినప్పటికి ఆ విషయం ఎందుకు బయటకు రాలేదు
  4. రాజకీయ వేధింపులు ఆయనకు కొత్తవా? గతంలో ఆయన ప్రతిపక్షంలో ఎన్నేళ్లు పనిచేయలేదు.
  5. ఆత్మహత్యకు కుమారుడి వేధింపులే కారణమంటూ పలువురు చేస్తున్న ఫిర్యాదుల విషయంలో వాస్తవం ఎంత? కోడెలకు, కుమారుడికి మధ్య విభేదాలు ఉన్నాాయా?
  6. తనపై, కుటుంబ సభ్యులపై ఉన్న కేసులే ఆయనను ఆత్మహత్య దిశగా ప్రేరేపించాయా?