“జగన్ దెబ్బకు చంద్రబాబు గ్యాలరీ ఎక్కారు”

| Edited By: Pardhasaradhi Peri

Jan 23, 2020 | 5:09 PM

అసెంబ్లీలో మండలిపై చర్చ జరుగుతోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన నేపథ్యంలో.. శాసనసభ్యులు తన అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రసంగించారు. మండలిలో కూడా బిల్లుపై చర్చ జరగాలని పంపిస్తే, దానిపై రాజకీయం చేశారని నాని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నిన్న టీడీపీ మండలి సభ్యులు వ్యవహరించారని పేర్కొన్నారు. యనమల పేరెత్తితే ఎన్టీఆర్‌కి పొడిచిన వెన్నుపోటే గుర్తొస్తుందని, ఆయన కూడా […]

జగన్ దెబ్బకు చంద్రబాబు గ్యాలరీ ఎక్కారు
Follow us on

అసెంబ్లీలో మండలిపై చర్చ జరుగుతోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన నేపథ్యంలో.. శాసనసభ్యులు తన అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రసంగించారు. మండలిలో కూడా బిల్లుపై చర్చ జరగాలని పంపిస్తే, దానిపై రాజకీయం చేశారని నాని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నిన్న టీడీపీ మండలి సభ్యులు వ్యవహరించారని పేర్కొన్నారు. యనమల పేరెత్తితే ఎన్టీఆర్‌కి పొడిచిన వెన్నుపోటే గుర్తొస్తుందని, ఆయన కూడా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారా అని ప్రశ్నించారు.

మంత్రి నాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

  • మండలి ఉంచాలా, లేదా అన్నది మనం ఆలోచించాలి
  • మండలిలో ఎస్సీ కమిషన్ బిల్లును ఆపేశారు
  • పెద్దల సభ అంటే బిల్లులుపై చర్చంచాలి తప్ప..తిరస్కరించరాదు
  • రౌడీలు, గూండాలు అంతా మండలికి వెళ్లారు
  • వికేంద్రీకరణపై చర్చ జరగాలన్న ఉద్దేశంతో బిల్లును పెట్టాం
  • మండలి గ్యాలరీలో కూర్చోని చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చారు
  • తప్పు జరిగిందని చెప్పి మరో తప్పు చేశారు
  • జగన్ దెబ్బకు చంద్రబాబు మండలి గ్యాలరీలో ఎక్కారు
  • ఈ సారి అసెంబ్లి గ్యాలరీలో ఎక్కించాలి
  • లోకేశ్‌కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సే
  • వైఎస్ మండలి తీసుకురాకుంటే లోకేశ్ మంత్రి అయ్యేవాడా
  • ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి, పెద్దల్ని గౌరవించడానికి వైఎస్ మండలి వ్యవస్థను ప్రవేశపెట్టారు
  • కానీ టీడీపీ సభ్యులు మండలి గౌరవాన్ని దిగజార్చుతున్నారు
  • మంత్రులు తాగి వచ్చారని, జర్దాలు తిన్నారని యనమల కించపరిచేలా మాట్లాడారు
  • చంద్రబాబు, ఆయన బామ్మర్ది తాగేరామో బ్రీత్ ఎనలైజర్స్‌తో చెక్ చేసుకోండి
  • మండలి ఛైర్మన్ షరీఫ్ చాలా మంచి వ్యక్తి, నాకు 37 సంవత్సరాల నుంచి తెలుసు. టీడీపీ ఆయన సిన్సియర్ కార్యకర్త..
  • షరీఫ్ గారిని ఏమి అనలేం..
  • సీఎం కంటే సూపర్ మ్యాన్ ఎవరైనా ఉంటారా..?
  • మండలిలో కొద్దిమంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు..
  • కూలంకషంగా చర్చించి మండలిపై ఓ నిర్ణయం తీసుకోవాలి