ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట..!

|

Oct 10, 2020 | 10:04 PM

ఉత్తర కొరియాలో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.

ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట..!
Follow us on

ఉత్తర కొరియాలో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి పాకింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని గడగడ లాడిస్తున్నప్పటికీ ఉత్తర కోరియాలోకి మాత్రం ప్రవేశించలేదని చెప్పారు. దేశంలో ఒక్క కరోనా కేసైనా నమోదు కాకపోవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75 వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన మిలిటరీ పరేడ్ నుద్దేశించి ప్రసంగించిన కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సరిహద్దులను మూసివేయడంతో పాటు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుని కరోనాను నియంత్రించగలిగామని ఉత్తర కొరియా ఇప్పటికే స్పష్టం చేసింది.

అయితే, ఇటీవల సరిహద్దు నుంచి ఉత్తర కొరియాలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు ప్రచారం జరిగింది. కాగా, ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందా లేదా అన్నది ఆ దేశ అధికారులు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు, కరోనా నియంత్రణ చర్యలు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి కిమ్ జంగ్ కోరడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదంటూ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా స్పష్టం చేశారు.