కిమ్ ఆస్తుల చిట్టా ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..!

|

Jun 05, 2020 | 9:26 PM

ప్రపంచ కుబేరుల లిస్టులో నియంత కిమ్ జాంగ్ ఉన్ పేరు కనిపించదు గానీ.. అతని ఆస్తులు ఎంతో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ..

కిమ్ ఆస్తుల చిట్టా ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..!
Follow us on

జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా.. ఇలా ప్రపంచ అపర కుబేరుల అధికారిక జాబితాను ప్రతీ ఏటా ఫోర్బ్స్, ఫార్చ్యూన్‌ వంటి ప్రముఖ మ్యాగజైన్‌లు విడుదల చేస్తుంటాయి. వీటితో పాటు బ్లూంబర్గ్‌ సంస్థ కూడా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వారి లిస్టును రిలీజ్ చేస్తుంది. అయితే ఈ జాబితాలోని ధనికులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. తమ ఆస్తుల వివరాలను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతూ ఎంతోమంది అపర కుబేరులు కాలం గడుపుతున్నారు. ఆ కోవలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, బ్రూనే సుల్తాన్, అండర్‌ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బషర్ అల్ అసద్‌లు ఉన్నారు.

ప్రపంచ కుబేరుల లిస్టులో నియంత కిమ్ జాంగ్ ఉన్ పేరు కనిపించదు గానీ.. అతని ఆస్తులు ఎంతో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ అతను ఊహకు అందనంత సంపాదించారు. కిమ్‌కు సుమారు 5 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ కూడా ఉత్తర కొరియాలోని సహజ సంపదనను అమ్మి పోగుజేశారని తెలుస్తోంది. దేశం నష్టాల్లో ఉన్నా కూడా అతను ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడట. కాగా, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం ఆస్తులు 1989లోనే సుమారు 25 బిలియన్ డాలర్లు ఉన్నట్లుగా ఓ పత్రిక అంచనా వేసింది.

ఇది చదవండి: ఈ నెల 8 నుంచి ఆలయాలు, మాల్స్, హోటళ్లు ఓపెన్.. మార్గదర్శకాలు ఇవే!