ప్రియురాలిని వేధించిన స్నేహితుడినే కాల్చిచంపాడు

|

Jul 23, 2020 | 11:02 PM

తన ప్రియురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్నేహితుడిని హత్య చేసి, ఆనవాళ్లు లేకుండాపెట్రోల్‌తో తగలుబెట్టాడు. కాలిపోయిన మృతదేహం వద్ద లభించిన చేతి గడియారం, కడియం, గొలుసు ద్వారా పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేశారు.

ప్రియురాలిని వేధించిన స్నేహితుడినే కాల్చిచంపాడు
Follow us on

తన ప్రియురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్నేహితుడిని హత్య చేసి, ఆనవాళ్లు లేకుండాపెట్రోల్‌తో తగలుబెట్టాడు. కాలిపోయిన మృతదేహం వద్ద లభించిన చేతి గడియారం, కడియం, గొలుసు ద్వారా పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేశారు.

గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్‌(38)కు అదే గ్రామానికి చెందిన గుర్రాల జోగారావు ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఎక్కువగా తిరుగుతుంటారని బంధువులు, గ్రామస్తులు చెప్పారు. ఇదే క్రమంలో అదే మల్కాపురానికి చెందిన గుంటు దీనా అలియాస్‌ స్వాతిని జోగారావు వివాహం చేసుకోవాలనుకున్నాడు. జోగారావు ఆమెను కలవడానికి వెళ్లినప్పుడల్లా ఇద్దరు మిత్రులు కలిసే వెళ్తుంటారు. ఇదే క్రమంలో ఆమెపట్ల గణేష్‌ పలు మార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పు రాకపోవటంతో జోగారావు, దీనాలు గణేష్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించారు. జూలై 5న అతనికి మద్యం తాగించి గ్లోటెక్స్‌ షాపింగ్‌మాల్‌ వెనుక మూతపడిన చేపల కంపెనీలోకి తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గణేష్‌ తలపై జోగారావు కర్రతో బలంగా కొట్టాడు. దీంతో కింద పడిపోయిన గణేష్ కాళ్లు దీనా పట్టుకోగా, జోగారావు బెల్టు తీసి అతని మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న పాత కాలువలో పడేసి వెళ్లిపోయారు. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. రెండు రోజుల తర్వాత జోగారావు, దీనా మరోసారి సంఘటనా స్థలానికి వచ్చిన పరిశీలించారు. గణేష్ డెడ్ బాడీ ఇంకా పాడవకుండా ఉండటం గమనించిన జోగారావు, దీనాలు పెట్రోల్‌ పోసి కాల్చేసి వెళ్లిపోయారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.

ఇదిలావుంటే, గాజువాక దరి గ్లోటెక్స్‌ షాపింగ్‌ మాల్‌ వెనుక కాలువలో ఈనెల 13న కాలిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై గుడివాడ అప్పన్నకాలనీ వీఆర్‌వో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాం వద్ద లభించిన వస్తువుల ఆధారంగా గ్రామాల్లో ఆరా తీయగా.. మృతుడు గుర్రం గణేష్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గణేష్ తో సన్నితంగా ఉండే జోగారావు, అతని ప్రియురాలు దీనా కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరి అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.