డేటింగ్ పై షాకింగ్ కామెంట్ చేసిన బ్యూటీ .. అలాంటివి అస్సలు నమ్మనంటున్న మహేష్ హీరోయిన్

|

Dec 05, 2020 | 3:37 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ కీయారా అద్వానీ. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన వినయ 'విధేయ రామ' అనే సినిమాలో నటించింది ఈ కుర్రది.

డేటింగ్ పై షాకింగ్ కామెంట్ చేసిన బ్యూటీ .. అలాంటివి అస్సలు నమ్మనంటున్న మహేష్ హీరోయిన్
ఆతర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా పరాజయం చెందిన తర్వాత కియారా మరో తెలుగు సినిమాలో నటించలేదు. 
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ కీయారా అద్వానీ. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన వినయ ‘విధేయ రామ’ అనే సినిమాలో నటించింది ఈ కుర్రది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించాక పోవడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ.. దూసుకుపోతుంది కియారా.

సినిమాల్లో తన అందంతో కట్టిపడేసే ఈ వయ్యారి ప్రేమ,పెళ్లి లాంటి వాటిలో మాత్రం తన ఆలోచనలు చాలా పద్దతిగా ఉంటాయని అంటుంది. తాజాగా కియారా నటించిన ‘ఇందూ కి జవానీ’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా డేటింగ్ యాప్ నేపథ్యంలో సాగనుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. తనకు డేటింగ్ పైన అస్సలు నమ్మకం లేదని చెప్పింది. ‘పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది. డేటింగ్ యాప్ సంస్కృతిని నేను ఇష్టపడను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.