విశాఖ విష‌వాయువు ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు…

|

May 11, 2020 | 6:35 PM

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో విష‌వాయువు లీకయ్యి 12 మందిని పొట్టనబెట్టుకోగా.. దీని ప్రభావానికి గురయిన వందలాది మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కళ్లముందే సొంతవాళ్లు విగతజీవులుగా మారడం చూసిన చ‌నిపోయినవారి బంధువుల వేధ‌న‌లు మిన్నంటున్నాయి. విష‌వాయువు ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎస్ ఐ ఆర్ – ఎన్ ఈ ఈ ఆర్ ఐ నిపుణుల బృందం ప‌ర్య‌టించి నివేదిక రూపొందించింది. ఈ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, ఇళ్ళలో స్టైరీన్ అవసేషాలు గుర్తించిన‌ నిపుణుల బృందం..అక్క‌డి […]

విశాఖ విష‌వాయువు ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు...
Follow us on

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో విష‌వాయువు లీకయ్యి 12 మందిని పొట్టనబెట్టుకోగా.. దీని ప్రభావానికి గురయిన వందలాది మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కళ్లముందే సొంతవాళ్లు విగతజీవులుగా మారడం చూసిన చ‌నిపోయినవారి బంధువుల వేధ‌న‌లు మిన్నంటున్నాయి. విష‌వాయువు ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎస్ ఐ ఆర్ – ఎన్ ఈ ఈ ఆర్ ఐ నిపుణుల బృందం ప‌ర్య‌టించి నివేదిక రూపొందించింది. ఈ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, ఇళ్ళలో స్టైరీన్ అవసేషాలు గుర్తించిన‌ నిపుణుల బృందం..అక్క‌డి ప్ర‌జ‌లకు బృందం ప‌లు సూచ‌న‌లు చేసింది.

  •  స్టైరీన్ ప్రభానికి గురైన వాళ్ళు ఏడాదిపాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
  • సమీప ప్రాంతంలో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించవద్దు
  • 3 కిలోమీటర్ల పరిధిలోని పశుగ్రాసాన్నీ వాడకూడదు
  • తదుపరి నివేదిక వచ్చేవరకు స్థానిక పాలఉత్పత్యులు వినియోగించరాదు
  • తాగు, వంట కోసం బహిరంగ జలాలు వాడొద్దు
  • ప్రభావిత ప్రాంతాలను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచాలి
  •  వాహనాలకు శుభ్రపరిచాకే వినియోగించాలి