కేర‌ళ‌లోని ప‌లు జిల్లాల్లో రెడ్ అలెర్ట్

|

Aug 09, 2020 | 5:28 PM

కేరళలోని పంబా ఆనకట్టలో నీరు 983.05 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నందున పతనమిట్ట జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నీటి మ‌ట్టం 984.5 మీటర్ల వద్దకు చేరుకుంటే రెడ్ అలర్ట్ ప్రకటించి..డ్యామ్ గేట్లు తెరుస్తారు.

కేర‌ళ‌లోని ప‌లు జిల్లాల్లో రెడ్ అలెర్ట్
Follow us on

Kerala Rains : కేరళలోని పంబా ఆనకట్టలో నీరు 983.05 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నందున పతనమిట్ట జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నీటి మ‌ట్టం 984.5 మీటర్ల వద్దకు చేరుకుంటే రెడ్ అలర్ట్ ప్రకటించి..డ్యామ్ గేట్లు తెరుస్తారు. కాగా, అలూవాలోని శివాలయంలో కొంత భాగం నీటిలో మునిగిపోయి ఉంది. అయితే, పెరియార్ నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుండ‌టం కాస్త ఊర‌ట క‌లిగించే అంశం. అందుకే గతంలో మునిగిపోయిన శివాల‌యం…ఇప్ప‌డు ఎక్కువ భాగం ఇప్పుడు నీటి మట్టానికి పైన ఉంది. గత కొద్ది రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. కోజికోడ్ జిల్లాలో శుక్రవారం భారత వాతావరణ శాఖ (ఐఎండి) రెడ్ అలర్ట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్ర‌మాదంలో మరణించిన వారి సంఖ్య 26 కి పెరిగిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం తెలిపారు. అయితే తాజా లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య 42 కి చేరింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో అలపుజ, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్ ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికను, రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి పసుపు హెచ్చరికను జారీ చేశారు.

 

Also  Read : అల్లుడు త‌ల న‌రికి.. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లిన మామ