మైనర్ సోదరీమణుల అత్యాచారం కేసు..నిందితుడిని చితకబాదిన ప్రజలు

|

Dec 08, 2019 | 6:29 PM

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని వాలయార్ స్టేషన్ లిమిట్స్‌లో శనివారం ఉదయం వాలయార్ అత్యాచారం, హత్య కేసులో నిందితుల్లో ఒకరికి ప్రజలు దేహశుద్ది చేశారు. నిందితుల్లో ఒకరైన మధు ఈ దాడిలో గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని పాలక్కాడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017 జనవరిలో కేరళలోని పాలక్కాడ్‌లోని వలయార్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలిక తన శిధిలమైన ఇంటిలో ఉరివేసుకుని కనిపించింది. బాలికను కొంతమంది వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేశారు. […]

మైనర్ సోదరీమణుల అత్యాచారం కేసు..నిందితుడిని చితకబాదిన ప్రజలు
Follow us on

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని వాలయార్ స్టేషన్ లిమిట్స్‌లో శనివారం ఉదయం వాలయార్ అత్యాచారం, హత్య కేసులో నిందితుల్లో ఒకరికి ప్రజలు దేహశుద్ది చేశారు. నిందితుల్లో ఒకరైన మధు ఈ దాడిలో గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని పాలక్కాడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2017 జనవరిలో కేరళలోని పాలక్కాడ్‌లోని వలయార్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలిక తన శిధిలమైన ఇంటిలో ఉరివేసుకుని కనిపించింది. బాలికను కొంతమంది వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆమె చనిపోయినట్లు గుర్తించిన రోజున ఇద్దరు పురుషులు ఇంటి నుండి బయటకు పరుగెత్తటం చూశానని ఆమె తొమ్మిదేళ్ల చెల్లెలు వాంగ్మూలం ఇచ్చింది. రెండు నెలల తరువాత, అనూహ్యంగా ఆ పాప కూడా అదే ప్రదేశంలోనే చనిపోయి కనిపించడం సంచలనంగా మారింది. ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనపై అప్పట్లో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం పెల్లుబికింది. ఈ కేసుకు సంబంధించి బాధితుల కుటుంబాన్ని క్రమం తప్పకుండా సందర్శించే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితులందరినీ స్థానిక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.లోకల్ కోర్టు తీర్పుతో విబేధించిన ప్రభుత్వం కేరళ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.