అక్కడ తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. పరుగులు తీయనున్న వాహనాలు..

| Edited By:

Apr 19, 2020 | 1:53 PM

భారత్ లో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం దేశంలో మే 3వరకు లాక్ డౌన్ విధించారు. అయితే.. ఏప్రిల్ 20 సోమవారం నుండి దేశంలో లాక్ డౌన్ కు కొంత విరామం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అక్కడ తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. పరుగులు తీయనున్న వాహనాలు..
Follow us on

భారత్ లో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం దేశంలో మే 3వరకు లాక్ డౌన్ విధించారు. అయితే.. ఏప్రిల్ 20 సోమవారం నుండి దేశంలో లాక్ డౌన్ కు కొంత విరామం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేరళలోని 14 జిల్లాల్లోని 7 జిల్లాల్లో కొంతవరకు సాధారణ స్థితి ఉంది. దీంతో ఈ జిల్లాల్లో రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి.  ప్రైవేట్ వాహనాలు కూడా ఆడ్-ఈవెన్ ఫార్ములాలో నడపడానికి అనుమతి లభించనుంది. కేరళ కేంద్రానికి ఒక ప్రతిపాదన చేసింది. దీనిలో కేరళను 4 జోన్లు(ఎరుపు, ఆరెంజ్ ఎ, ఆరెంజ్ బి, గ్రీన్ జోన్)గా విభజించారు.

కాగా.. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ నెల 20నుండి లాక్ డౌన్ ను కొంత సడలించనున్నారు. ఈ జోన్లలో దశలవారీగా లాక్ డౌన్ సడలించనున్నారు . కేరళ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.  దీనితో సోమవారం నుండి రాష్ట్రంలో దీనిని అమలు చేయనున్నారు. గ్రీన్ జోన్లో ఉన్న కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో జన జీవనం సాధారణం కానుంది.  అలాగే ఆరెంజ్ బి జోన్‌లోని తిరువనంతపురం, అలప్పుజ, త్రిస్సూర్, పాలక్కాడ్, వయనాడ్ జిల్లాల్లో కొన్ని ఆంక్షలను ఎత్తివేయనున్నారు.