కేరళ తాకిన నైరుతి రుతుపవనాలు.. నాలుగు జిల్లాల్లో అరెంజ్ అలర్ట్..!

|

Jun 02, 2020 | 6:37 PM

నైరుతి రుతుపవనాలు రావడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొజిక్కోడ్, కన్నూరు, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

కేరళ తాకిన నైరుతి రుతుపవనాలు.. నాలుగు జిల్లాల్లో అరెంజ్ అలర్ట్..!
Follow us on

వానకాలం వచ్చేంది. చల్లని నీటి మబ్బులు కేరళ రాష్ట్రాన్ని అలుముకున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకాయి. దీంతో మంగళవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇండియన్ మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర రాజధాని నగరంతోపాటు చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొజిక్కోడ్, కన్నూరు, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాదాపు 64 మిల్లీమీటర్ల నుంచి 115 మిల్లీ మీటర్ల వర్షపాతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణం శాఖ. మరో ఏడు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాటి విపత్తు తలెత్తకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు.