ఈ దొంగోడు భలే మంచోడు…సైనికుడి ఇంటికి చోరీకి వెళ్లి..

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:07 PM

అవసరానికి దొంగతనం చేసేవాళ్లు కొందరు. ఆకలేసి దొంగతనం చేసే వారు మరికొందరు. ఉన్నోడిని కొట్టి, లేనోడికి పెట్టాలనుకునే దొంగలు కూడా అరుదుగా ఉంటారు. ఇలా దొంగతనాలకు, చోరీలకు పాల్పడేవాళ్లకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంటే దొంగలు..దొంగలు ఊర్లు పంచుకున్నట్టు కాదు. దొంగతనం చేసే ఇంటిలోని వ్యక్తుల యొక్క స్థాయి, స్థానాన్ని బట్టి కూడా దొంగలు మనసు మార్చుకుంటారు. ఏంటి నమ్మడం లేదా..? అయితే మీరు ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఇటీవల కేరళలో పక్కపక్కన షాపుల్లో దొంగతనాలు […]

ఈ దొంగోడు భలే మంచోడు...సైనికుడి ఇంటికి చోరీకి వెళ్లి..
Follow us on

అవసరానికి దొంగతనం చేసేవాళ్లు కొందరు. ఆకలేసి దొంగతనం చేసే వారు మరికొందరు. ఉన్నోడిని కొట్టి, లేనోడికి పెట్టాలనుకునే దొంగలు కూడా అరుదుగా ఉంటారు. ఇలా దొంగతనాలకు, చోరీలకు పాల్పడేవాళ్లకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంటే దొంగలు..దొంగలు ఊర్లు పంచుకున్నట్టు కాదు. దొంగతనం చేసే ఇంటిలోని వ్యక్తుల యొక్క స్థాయి, స్థానాన్ని బట్టి కూడా దొంగలు మనసు మార్చుకుంటారు. ఏంటి నమ్మడం లేదా..? అయితే మీరు ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఇటీవల కేరళలో పక్కపక్కన షాపుల్లో దొంగతనాలు కలకలం సృష్టించాయి. ఒక్క దొంగ పక్కాగా రెక్కీ వేసి షాపులన్నింటిని దోచుకున్నాడు. ఐదు షాపులు కన్నం వేసి..కసిగా విజయానందంతో ఆ పక్కనే ఉన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఇక తన తస్కర విద్య ప్రదర్శిస్తుండగా..అతగాడికి ఆ ఇంట్లో ఓ ఆర్మీ క్యాప్ దర్శనమిచ్చింది. దీంతో దొంగ వెంటనే అలర్టయ్యాడు. పారిపోడానికి అనుకోనేరు. సెల్యూట్ చెయ్యడానికి. వెంటనే తన మనసు మార్చుకోని..ఆ ఇంట్లో గుండు సూది కూడా ముట్టుకోకుండా వెనుదిరిగాడు. అంతేనా..తనను క్షమించమంటూ ఆ ఇంట్లో నివాసం ఉంటోన్న మాజీ సైనికాధికారికి ఓ సందేశం కూడా రాశాడు. కాకపోతే తప్పు చేశానన్న బాధలో..ఇంట్లో ఉన్న ఆర్మీ మందు ఓ పెగ్గు వేశాడట. ఎర్నాకుళం జిల్లా తిరువాన్‌కుళం‌లో గత మంగళవారం రాత్రి ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

సదరు ఇంటి యజమాని ఐజాక్ మణి కుటుంబంతో సహా బహ్రెయిన్ వెళ్లారు. రోజూ పనిమనిషి వచ్చి ఇల్లు శుభ్రం చేసి లాక్ వేసి వెళ్లిపోతుంది. అయితే ఒకరోజు డోర్స్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి..ఇంట్లో వస్తువులు ఏమి చోరికి గురవ్వలేదని నిర్దారించారు. అయితే అక్కడి గోడ మీద ఓ ఉన్న ఓ సందేశం పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘బైబిల్‌లోని 7వ నిబంధనను నేను అతిక్రమించాను. ఇది దేశ సైనికుడి గృహమని నాకు తెలీదు. ఆర్మీ క్యాప్ చూసిన తర్వాత నిర్దారణ అయ్యింది. ఆర్మీ అధికారి.. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఆర్మీకి చెందిన వ్యక్తి ఇల్లని తెలిస్తే అసలు ప్రవేశించేవాడినే కాదు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనా ఈ దొంగోడు భలే మంచోడు కదూ..!

ఇది కూడా చదవండి : బాలుడి ఒంటి నుంచి కారుతోన్న రక్తం.. ఇదో వింత వ్యాధి..