బ్రేకింగ్ : కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కేసీఆర్ విగ్రహం..!

| Edited By:

Jun 17, 2019 | 5:08 PM

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన అభిమానులు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ బీడు భూములకు సాగునీరు.. పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించే వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు. అత్యంత వేగవంతంగా కాళేశ్వరాన్ని పూర్తిచేసిన సీఎం కేసీఆర్‌ను అన్నదాతలు అపర భగీరథుడని కీర్తిస్తున్నారు. మరికొందరు అభిమానులు ఏకంగా ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ […]

బ్రేకింగ్ : కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కేసీఆర్ విగ్రహం..!
Follow us on

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన అభిమానులు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.

తెలంగాణ బీడు భూములకు సాగునీరు.. పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించే వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు. అత్యంత వేగవంతంగా కాళేశ్వరాన్ని పూర్తిచేసిన సీఎం కేసీఆర్‌ను అన్నదాతలు అపర భగీరథుడని కీర్తిస్తున్నారు.

మరికొందరు అభిమానులు ఏకంగా ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్‌ మండలం అంబటి పల్లి గ్రామానికి చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడి ఇంటి దగ్గర కేసీఆర్ విగ్రహాన్ని ఉంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన 2016 మే 2న విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించారు. అయితే కొంత మంది నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిష్టిస్తే బావుంటుందని చెప్పడంతో ఇప్పుడు నెలకొల్పుతున్నారు.