కేసీఆర్‌కి ‘నోబెల్ బహుమతి’ ఇవ్వవచ్చు: బిపిన్ చంద్ర

| Edited By:

Jul 18, 2019 | 6:58 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నోబెల్ బహుమతికి అర్హుడని.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి బిపిన్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యూహకర్త అని అభివర్ణించారు. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. అది నీటికోసమేనని.. అలాంటి సమస్యను సీఎం కేసీఆర్ ముందుగానే ఊహించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం రూపకల్పన కూడా కేసీఆర్‌ ఊహాతీతానికి నిదర్శనమన్నారు. అన్ని రకాలుగా కేసీఆర్ ముందుగానే ఊహించి సమస్యలను అధిగమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. […]

కేసీఆర్‌కి నోబెల్ బహుమతి ఇవ్వవచ్చు: బిపిన్ చంద్ర
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నోబెల్ బహుమతికి అర్హుడని.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి బిపిన్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యూహకర్త అని అభివర్ణించారు. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. అది నీటికోసమేనని.. అలాంటి సమస్యను సీఎం కేసీఆర్ ముందుగానే ఊహించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం రూపకల్పన కూడా కేసీఆర్‌ ఊహాతీతానికి నిదర్శనమన్నారు. అన్ని రకాలుగా కేసీఆర్ ముందుగానే ఊహించి సమస్యలను అధిగమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే.. అన్ని విధాలా నోబెల్ బహుమతికి తగిన వ్యక్తి అని బిపిన్ చంద్ర చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు.