భారమంతా మీదే.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ డెడ్లీ వార్నింగ్

|

Jan 04, 2020 | 3:14 PM

తెలంగాణ మునిసిపాలిటీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా వుందని గులాబీ బాస్ కేసీఆర్ అన్నారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వున్నాయని, ఎలాంటి బెదురు లేకుండా ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ని సమాయత్తం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మునిసిపల్ ఎన్నికలపై పార్టీ శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.   120 మునిసిపాలిటీలు,10 కార్పొరేషన్‌లలో పార్టీ నాలుగు సార్లు చేసిన సర్వే […]

భారమంతా మీదే.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ డెడ్లీ వార్నింగ్
Follow us on

తెలంగాణ మునిసిపాలిటీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా వుందని గులాబీ బాస్ కేసీఆర్ అన్నారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వున్నాయని, ఎలాంటి బెదురు లేకుండా ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ని సమాయత్తం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మునిసిపల్ ఎన్నికలపై పార్టీ శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.

 

120 మునిసిపాలిటీలు,10 కార్పొరేషన్‌లలో పార్టీ నాలుగు సార్లు చేసిన సర్వే వివరాలను కేసీఆర్ వెల్లడించారు. మునిసిపాలిటీ వారీగా ఓటరు జాబితాతో పాటు నూతన మున్సిపల్ యాక్ట్ కాపీలను పార్టీ నాయకులకు అందజేశారు ఈ సమావేశంలో.  నియోజకవర్గా వారీగా ఎమ్మెల్యేలకు మునిసిపల్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు కేసీఆర్. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దని, టీఆర్ఎస్ పార్టీకి ఎవరితో పోటీ లేనే లేదని చెప్పారు కేసీఆర్. పాత, కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని ఆదేశించారు. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేశాక ఆ అభ్యర్థి గెలుపు కోసమే అందరూ పని చేయాలని సూచించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని, మిగిలిన బాధ్యతంతా ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ చెప్పారు. టిక్కెట్ల ఖరారుతో పాటు రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదేనని ఆయన చెప్పారు. అదే సమయంలో మంత్రులు కూడా మునిసిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే మంత్రి పదవులపై ప్రభావం వుంటుందని హెచ్చరించారు. లంచ్ బ్రేక్‌లో కీలక మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లపై కేసీఆర్ సంబంధిత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడిగా భేటీ అయ్యారు కేసీఆర్.