దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణం.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్!

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2019 | 5:58 PM

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి, నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇక్కడ గోదావరిలో 5 నెలల పాటు పుష్కలమైన నీటి ప్రవాహం ఉంటుందని.. ఈ నేపథ్యంలో అక్కడ 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి మూడు టీఎంసీల నీటిని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను […]

దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణం.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్!
Follow us on

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి, నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇక్కడ గోదావరిలో 5 నెలల పాటు పుష్కలమైన నీటి ప్రవాహం ఉంటుందని.. ఈ నేపథ్యంలో అక్కడ 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి మూడు టీఎంసీల నీటిని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవాలని తెలిపారు. వీటికి సుమారు రూ.14వేల కోట్ల బడ్జెట్ అవసరమని తెలుస్తోంది. వీటితోపాటు మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ నీటిని తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా టెండర్లు ఆహ్వానించాలని పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు.