#Lock-down లాక్‌డౌన్ సమస్యలపై కేసీఆర్ ఫోకస్.. వాహ్ వాటె స్టెప్!

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 5:53 PM

కరోనా వైరస్ ప్రబలకుండా వుండేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ ప్రజలకు కనీవినీ ఎరుగని సమస్యలను తెస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు వదిలి రాలేక.. నిత్యం అవసరమయ్యే వస్తువులు, కూరగాయలను కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు.

#Lock-down లాక్‌డౌన్ సమస్యలపై కేసీఆర్ ఫోకస్.. వాహ్ వాటె స్టెప్!
Follow us on

KCR super decision to address Lock-down problems: కరోనా వైరస్ ప్రబలకుండా వుండేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ ప్రజలకు కనీవినీ ఎరుగని సమస్యలను తెస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు వదిలి రాలేక.. నిత్యం అవసరమయ్యే వస్తువులు, కూరగాయలను కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. కొందరు తెగించి ఇళ్ళలోంచి బయటికి వచ్చి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు రుచి చూస్తున్నారు. ఈరకమైన సమస్యలను నివారించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర కూరగాయలను ప్రజల ముంగిట్లోకి పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకోసం మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జి.హెచ్.ఎం.సి. సహకారంతో నగరంలో మొబైల్ రైతు బజార్లను నడపాలని నిర్ణయించారు. కేటీఆర్ సూచనలతో శనివారం 177 మొబైల్ రైతు బజార్ల ద్వారా నగరంలోని 331 ప్రాంతాల్లో కూరగాయలు విక్రయిoచారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే మొబైల్ రైతు బజార్లలో కూరగాయలు అమ్మాలని అధికారులు ఆదేశించారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ప్రతి మొబైల్ రైతు బజారు వాహనం తిరిగే విధంగా షెడ్యూలును, ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడ అమ్మాలో.. ఎంత సేపు విక్రయించాలో సమయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.