ఖడ్గ చాలనం కాదు.. కరచాలనమే.. కేసీఆర్

| Edited By:

May 30, 2019 | 1:42 PM

ఏపీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ వయస్సు చిన్నది.. బాధ్యత పెద్దది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బాధ్యతను నెరవేర్చే శక్తి ఉందని నిరూపించుకొన్నారని.. తండ్రి నుండి శక్తి సామర్థ్యాలు సంక్రమించాయని కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాలు ఖడ్గ చాలనం చేయొద్దని.. కరచాలనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతమౌతాయని ఆయన ఆశాభావం […]

ఖడ్గ చాలనం కాదు.. కరచాలనమే.. కేసీఆర్
Follow us on

ఏపీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ వయస్సు చిన్నది.. బాధ్యత పెద్దది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బాధ్యతను నెరవేర్చే శక్తి ఉందని నిరూపించుకొన్నారని.. తండ్రి నుండి శక్తి సామర్థ్యాలు సంక్రమించాయని కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాలు ఖడ్గ చాలనం చేయొద్దని.. కరచాలనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతమౌతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాలూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. కృష్ణా నది జలాల వినియోగంలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అలాగే జగన్ ఒక్క టర్మ్ కాదు.. నాలుగైదు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన అభిలషించారు.