వైసీపీ ఎంపీ కుటుంబానికి సోకిన‌ కరోనా…ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు..ఏకంగా..

|

Apr 26, 2020 | 8:28 PM

ఏపీలో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది. ఇప్ప‌టికే 1000 దాటి 1100 వైపు ప‌రిగెడుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రత ఎక్కువ‌గా ఉంది. మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కేసులు సంఖ్య ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కర్నూలువైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఎంపీ ఇద్దరు సోదరులు, […]

వైసీపీ ఎంపీ కుటుంబానికి సోకిన‌ కరోనా...ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు..ఏకంగా..
Follow us on

ఏపీలో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది. ఇప్ప‌టికే 1000 దాటి 1100 వైపు ప‌రిగెడుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రత ఎక్కువ‌గా ఉంది. మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కేసులు సంఖ్య ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కర్నూలువైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఎంపీ ఇద్దరు సోదరులు, వారి భార్య‌లు, వీరిలో ఒకరి కుమారుడు(14) ఉండగా, 83ఏళ్ల తండ్రికీ కోవిడ్ సోకినట్లు తేలింది. ఎంపీ తండ్రి పరిస్థితి విష‌యంగా ఉండటంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు డాక్ట‌ర్లే అని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని స్వ‌యంగా ఎంపీ సంజీవ్ కుమార్ క‌న్ఫామ్ చేశారు.