ఆలమట్టి ఎత్తు పెంపుపై కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదనలు

|

Jul 03, 2020 | 5:39 PM

ఎగువన కృష్ణానదిపై ఉన్న ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచాలని కర్నాటక నిర్ణయించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారనుంది. ఆలమట్టి జలాశయం ఎత్తు పెంపుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కర్ణాటక జల వనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి వెల్లడించారు.

ఆలమట్టి ఎత్తు పెంపుపై కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదనలు
Follow us on

ఎగువన కృష్ణానదిపై ఉన్న ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచాలని కర్నాటక నిర్ణయించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారనుంది. ఆలమట్టి జలాశయం ఎత్తు పెంపుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కర్ణాటక జల వనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి వెల్లడించారు. ఆయన గురువారం కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జల్‌పుర తాలూకా సొన్న బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆలమట్టి ఆనకట్ట ఎత్తు ప్రస్తుతం 519 మీటర్లుందని, దాన్ని 524 మీటర్లకు పెంచాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపామని, త్వరలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల పాలిట పిడుగులా మారనుంది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కాదని, కర్నాటక ప్రభుత్వం ఆలమట్టి ఎత్తు పెంపుదలకు ఆడుగేస్తోంది. అదే జరిగితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు వచ్చే వరదనీరు చాలా వరకు తగ్గుతుందని నీటిపారుదల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని లక్షలాది ఎకరకాల ఆయకట్టును ఎడారిగా మార్చే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై ఆధారపడ్డ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుందంటున్నారు.