నీళ్లిచ్చారు: కర్ణాటక సిఎంకి కేసీఆర్ థాంక్స్

| Edited By:

May 03, 2019 | 5:38 PM

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది యాసంగి పంట కాలంలో వర్షాభావం ప్రభావంతో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో నీరు విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి […]

నీళ్లిచ్చారు: కర్ణాటక సిఎంకి కేసీఆర్ థాంక్స్
Follow us on

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది యాసంగి పంట కాలంలో వర్షాభావం ప్రభావంతో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో నీరు విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరపున కుమారస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.