రసవత్తరంగా.. కర్నాటక జడ్జిమెంట్..! కుర్చీ ఎవరిదో..!

| Edited By: Srinu

Dec 09, 2019 | 2:04 PM

కర్ణాటకలో మరికొద్ది గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది. కాగా.. ఎడియూరప్ప ధర్మస్థలలోని మంజునాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు. అటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లి.. సాయినాథుడిని దర్శించుకున్నారు. ఈ నెల 5న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో కేసులు […]

రసవత్తరంగా.. కర్నాటక జడ్జిమెంట్..! కుర్చీ ఎవరిదో..!
Follow us on

కర్ణాటకలో మరికొద్ది గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది. కాగా.. ఎడియూరప్ప ధర్మస్థలలోని మంజునాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు. అటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లి.. సాయినాథుడిని దర్శించుకున్నారు.

ఈ నెల 5న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. ఇవాళ వెల్లడయ్యే ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే ఎడియూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.