కేంద్రం, భద్రతా బలగాల వెంటే మేమంతా : రాహుల్ గాంధీ

| Edited By: Srinu

Mar 07, 2019 | 8:18 PM

పుల్వామా ఆత్మాహుతి దాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, దేశమంతా కేంద్రానికి, జవాన్లకు మద్దతుగా నిలుస్తాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్దిసేపటికే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని టెర్రరిస్టులు భావిస్తున్నారని అన్నారు. దేశాన్ని విభజించడం ఏవరికీ సాధ్యం కాదని.. యావత్ దేశం, ప్రతిపక్షాలు, […]

కేంద్రం, భద్రతా బలగాల వెంటే మేమంతా : రాహుల్ గాంధీ
Follow us on

పుల్వామా ఆత్మాహుతి దాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, దేశమంతా కేంద్రానికి, జవాన్లకు మద్దతుగా నిలుస్తాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్దిసేపటికే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని టెర్రరిస్టులు భావిస్తున్నారని అన్నారు. దేశాన్ని విభజించడం ఏవరికీ సాధ్యం కాదని.. యావత్ దేశం, ప్రతిపక్షాలు, కేంద్రానికి, భద్రతా దళాలకు మద్దతుగా ఉంటాయన్నారు. కాగా మూడు రోజులపాటు రాజకీయ చర్చలకు పార్టీ పరంగా దూరంగా ఉంటామని తెలిపారు. ఉగ్రవాదం అనేది రుగ్మత లాంటిదని.. దానిపై పోరాటం విషయంలో రాజీ తగదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.