పవన్‌ బకెట్ల నిండా బురదే.. చల్లేందుకే యాత్రలు

| Edited By: Pardhasaradhi Peri

Dec 09, 2019 | 7:49 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు గుప్పించారు ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు. బక్కెట్లతో బురద పట్టుకుని జగన్‌పై చల్లేందుకు పవన్ యాత్రలు చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. అరకొర సమాచారంతో పవన్ ప్రభుత్వంపై ఏదేదో మాట్లాడుతున్నారని, లేని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తామని జనసేనాధిపతి చెబుతున్నారని కన్నబాబు వివరించారు. 2014-19 మధ్య కాలంలో రైతులు పవన్‌కు కన్పించ లేదా అని మంత్రి ప్రశ్నించారు. […]

పవన్‌ బకెట్ల నిండా బురదే.. చల్లేందుకే యాత్రలు
Follow us on

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు గుప్పించారు ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు. బక్కెట్లతో బురద పట్టుకుని జగన్‌పై చల్లేందుకు పవన్ యాత్రలు చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. అరకొర సమాచారంతో పవన్ ప్రభుత్వంపై ఏదేదో మాట్లాడుతున్నారని, లేని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తామని జనసేనాధిపతి చెబుతున్నారని కన్నబాబు వివరించారు.

2014-19 మధ్య కాలంలో రైతులు పవన్‌కు కన్పించ లేదా అని మంత్రి ప్రశ్నించారు. తాను పర్యటనకు వస్తుంటే 87 కోట్ల రూపాయలు క్లియర్ చేశారంటూ పవన్ అర్ధం లేని కామెంట్లు చేస్తున్నారని, అసలు పవన్‌కు ప్రభుత్వం భయపడడమేంటని కన్నబాబు వ్యాఖ్యానించారు. రోటీన్‌గా చేసే పనిని కూడా తనకు భయపడి చేశారన్న భ్రమలో పవన్ కల్యాణ్ వున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు.

ఏ ఎమ్మెల్యే.. ఏ మంత్రి రైతులను ఇబ్బందికి గురి చేశారో పవన్ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ‘‘మాది రైతు పక్షపాత ప్రభుత్వం..ఎవరో వచ్చి ప్రభుత్వ బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం లేదు‘‘ అని మంత్రి వ్యాఖ్యానించారు. ధరల స్ధిరీకరణ నిధి ద్వారా ధరలను కంట్రోల్ చేస్తున్నామని, 88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామని కన్నబాబు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లకు కేటాయించిన నిధులను పక్కదారికి మళ్లించారని, ఆ సందర్భంలో నోరు మెదపని పవన్ కల్యాణ్ ఇప్పుడు తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి.